‘ఒక లైలా కోసం’ ట్రైలర్ లోనే స్క్రీన్-ప్లేతో మ్యాజిక్ చేశాడు దర్శకుడు విజయ్ కుమార్ కొండా. సెకన్ కూడా వేస్ట్ చేయకుండా స్ట్రెయిట్ గా స్టొరీలోకి తీసుకు వెళ్ళిపోయాడు. హీరో హీరోయిన్లు ఇద్దరూ టామ్ & జెర్రీ తరహాలో ఫైట్ చేసుకుంటూ ఉంటారనే హింట్ ఇచ్చాడు. ఎప్పుడూ కొట్టుకునే వీరు లవ్ లో ఎలా పడ్డారు..? అని పాయింట్ చెప్పకుండా అభిమానులను సస్పెన్స్ లో పెట్టి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాడు. ద్వేషించుకునే తల్లిదండ్రులు, హీరో ప్రేమించినా… రిజెక్ట్ చేసే హీరోయిన్, ప్రేమ కోసం హీరో ఎం చేశాడు..? అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ను 2 నిముషాలలో చూపించి ప్రేక్షకుడిలో థియేటర్ కు వెళ్ళాలి అనుకునేలా చేయడంలో 100% సక్సెస్ అయ్యారు.
యంగ్ లవర్ బాయ్ పాత్రలో నాగ చైతన్య నటన బాగుంది. ముఖ్యంగా చాలా స్టైలిష్ గా కనపడుతున్నాడు. డాన్స్ స్టెప్స్, కామెడీ టైమింగ్ సింప్లీ సూపర్బ్. ఇన్నోసెంట్ కాలేజీ గర్ల్ పాత్రలో పూజా హెడ్గే ఆకట్టుకుంది. ట్రైలర్ ఇన్స్టంట్ హిట్ టాక్ సొంతం చేసుకోవడానికి మరో ముఖ్య కారణం డైలాగులు. చాలా సహజంగా ఉన్నాయి. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో ఫీల్ ని ఎలివేట్ చేయడానికి బాగా హెల్ప్ అయ్యింది. విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి.
‘ఏం మాయ చేశావే’, ‘100% లవ్’, ‘మనం’ సినిమాల తర్వాత మరోసారి ఆ తరహా రొమాంటిక్ లవ్ స్టొరీతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు నాగ చైతన్య. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ విజయం తర్వాత విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Click here to watch Oka Laila Kosam trailer
