భారీ అమౌంట్ కి ‘పవర్’ నైజాం రైట్స్ దక్కించుకున్న దిల్ రాజు

dill-raj-power

మాస్ మహారాజ రవితేజ వరుసగా ఫ్లాపులు అందుకుంటున్న టైంలో ‘బలుపు’ సినిమా సక్సెస్ ని అందించి మళ్ళీ రవితేజని ఫాంలోకి తీసుకొని వచ్చింది. ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్న రవితేజ దాదాపు ఒక సంవత్సర కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ మన ముందుకు వస్తున్న సినిమా ‘పవర్’. ఈ సినిమాకి ఫస్ట్ టీజర్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే విడుదలైన సెకండ్ టీజర్, సాంగ్స్ విజువల్స్ మరియు ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

అంతే కాకుండా ఫిల్మ్ నగర్లో కూడా ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ ఉండడంతో బిజినెస్ కూడా బాగా జరుగుతోంది. ‘పవర్’ మూవీ నైజాం రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు 9 కోట్లకి కొనుగోలు చేసారు. రవితేజ కెరీర్లో ఇంత పెద్ద మొత్తంలో నైజాం రైట్స్ అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. ఒక్క నైజాం మాత్రమే కాకుండా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్స్ భారీ మొత్తంతో పోటీ పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే మళ్ళీ రవితేజ ఫుల్ ఫాంలోకి వచ్చినట్టు కనపడుతోంది.

కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన హన్సిక, రెజీన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. మరి సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి..

Exit mobile version