
తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయక్కర్లేని మరియు బాగా సుపరిచితులైన ఫ్యామిలీ డా. మోహన్ బాబు ఫ్యామిలీ. ఆయన విలక్షణ నటుడిగా, ఒక నిర్మాతగా, ఒక విద్యావేత్తగా ఎంత విజయాన్ని, ఎన్ని ఉన్నత శిఖరాలను అందుకున్నాడో అదే బాటలో ఆయన పిల్లలు మంచు విష్ణు, మంచు మనోజ్, లక్ష్మీ మంచులు కూడా తమ టాలెంట్ ని నిరూపించుకునే పనిలో ఉన్నారు.
మోహన్ బాబు ఏం చేసినా బాగా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నారు. తాజాగా ఆయన అంతే గ్రాండ్ గా ఓ కొత్త విల్లాని కట్టించారు. మాములుగా మోహన్ బాబు నివాసం ఫిల్మ్ నగర్ లో ఉంది. కానీ మోహన్ బాబు ఎవ్వరూ ఊహించని భారీ మొత్తంతో స్పెషల్ గా డిజైన్ చేసిన ఓ విల్లాని శంషాబాద్ లో కట్టించుకున్నారు. నేడు డా. మోహన్ బాబు మరియు అతని ఫ్యామిలీ ఆ కొత్త విల్లాకి షిఫ్ట్ అవుతున్నారు. ది బెస్ట్ ఫర్నిచర్ తో కళ్ళు మిరుమిట్లు గొలిపే ఈ విల్లాని నిర్మించారని సమాచారం. ప్రస్తుతం షిఫ్టింగ్ కి సంబందించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.