
సోషల్ మీడియాలో వివాదాస్పద, సంచలన వ్యాఖ్యాలు చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తెలంగాణ సిఎం కేసీఆర్ ను పొగుడుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. గతంలో ఒకసారి కేసీఆర్ పై వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కేసీఆర్ అభిమానులు నిరసన కూడా వ్యక్తం చేశారు. ఈసారి ఎటువంటి స్పందన వస్తుందో..!
నా నెక్స్ట్ సినిమా టైటిల్ ‘కేసీఆర్’. ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ మిన్న. కేసీఆర్ అని పలికేటప్పుడు వచ్చే సౌండింగ్ ఎన్టీఆర్, వైఎస్సార్ అనే పేర్లలో లేదు. అధికారం, అయన వ్యక్తిత్వం కేసీఆర్ ను అందగాడిని చేశాయని వర్మ ట్వీట్ చేశారు. అంతటితో ఆగలేదు, హీరోయిన్లతో తెలంగాణ సిఎంను పోల్చారు. సమంత, తమన్నా, ఇలియానా లను కలిపితే ఉండే అందమంతా కేసీఆర్ లో ఉందని అన్నారు. హిట్లర్ ఓ చెడ్డ కేసీఆర్.. కాని కేసీఆర్ ఓ మంచి హిట్లర్ అంటూ ఫైనల్ పంచ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను చూసిన వారికీ వర్మ కేసీఆర్ ను పొగిడారో..? తిట్టారో..? అర్ధం కాలేదు.