తెలుగులో భారీగా రిలీజ్ చేయనున్న షారుఖ్ ఖాన్ సినిమా

happy-new-year

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా రానున్న సినిమా ‘హ్యాపీ న్యూ ఇయర్’. ఈ సినిమాని ఒక్క హిందీలోనే కాకుండా తెలుగు మరియు తమిళంలో కూడా భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తో పాటు అభిషేక్ బచ్చన్, దీపిక పడుకొనే, బొమన్ ఇరానీ, సోనూ సూద్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీళ్ళందరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న హీరోలు కావడంతో ఈ సినిమాని తెలుగులో కూడా భారీగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం అదే విషయంపై షారుఖ్ ఖాన్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ అయిన రెడ్ చిల్లీస్ వారు చర్చలు జరుపుతున్నారు. దీపావళికి ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాల థియేటర్స్ కి ఈ సినిమా థియేటర్స్ కి మధ్య ఎలాంటి సమస్య రాకూడదని ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఫరా ఖాన్ దరశాకత్వం వహించిన ఈ సినిమా అంతా ఓ దొంగతనం చుట్టూ తిరుగుతుంది.

Exit mobile version