నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ ఆడియో రిలీజ్ డేట్

oka-lila-kosam

రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేయడంలో తనకంటూ ఓ బ్రాండ్ సంపాదించుకున్న యంగ్ హీరో నాగ చైతన్య చేసిన మరో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఒకలైలాకోసం’. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 29న అక్కినేని నాగార్జున బర్త్ డే కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాని ఓ పాటని ఆగష్టు 15న రిలీజ్ చేస్తే, మరో రెండు పాటలని విజయవాడ పివిపి మాల్ లో అభిమానుల సమక్షంలో రిలీజ్ చేసారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని ఆగష్టు 22న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

నాగ చైతన్య సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని ఫ్యామిలీ ఈ మూవీని నిర్మిస్తోంది.

Exit mobile version