
‘ఆంధ్రావాలా’ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కే ఓ సినిమా ఆగష్టు 1న ప్రారంభమైంది. ఎన్.టి.ఆర్ లేకుండా పూరి జగన్నాధ్ మిగతా టీంతో హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ని ప్రారంభించాడు. ఇప్పటి వరకూ నటీనటులపై కొన్ని సన్నివేశాలను షూట్ చేసారు. తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ రేపటి నుంచి ఈ మూవీ సెట్లో అడుగుపెట్టనున్నాడు.
రేపటి నుంచి పూరి జగన్నాధ్ ఎన్.టి.ఆర్ పై వచ్చే సీన్స్ ని హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేయనున్నాడు. ఈ మూవీలో ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. వక్కంతం వంశీ కథకి పూరి తన మార్క్ తో కూడిన పవర్ఫుల్ డైలాగ్స్ ని ఎన్.టి.ఆర్ కి రాసాడని సమాచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్ టైనర్ ని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు.
ఇది కాకుండా ఎన్.టి.ఆర్ నటించిన ‘రభస’ సినిమా ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రభస’ ఆగష్టు 21న సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుంది.