
‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాతో సినిమాలను పక్కన బెట్టి పూర్తిగా రాజకీయాలతో బిజీ అయిపోయిన మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ముఖానికి రంగేసుకొని కెమెరా ముందుకు రానున్నాడు. ఆయన చేయనున్న 150వ సినిమా గురించిన పూర్తి వివరాలను రేపు చిరు పుట్టిన రోజు సందర్భంగా తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ ఫోటో షూట్ ని ఈ రోజు రిలీజ్ చేసారు.
ఈ ఫోటో షూట్ లో చిరంజీవి లుక్ కి మెగా అభిమానులు, సినీ ప్రేమికులు, మీడియా వారి నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. మెగా అభిమానులంతా చిరు రీ ఎంట్రీని కింగ్ ఈస్ బ్యాక్ అని తమ అభిమానాన్ని మరియు ఆనందాన్ని చాటుటున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం మెగాస్టార్ లుక్, రీ ఎంట్రీ అనేది చర్చనీయాంశం అయ్యింది.
చిరంజీవి తన 150వ సినిమాని ఫుల్ కామెడీ విత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. చిరు మెసేజ్ ఓరియెంటెడ్ లేదా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలపై ఆసక్తి చూపడం లేదు. అలాగే ఇప్పుడు చిరు దగ్గర పలు కథలు ఉన్నాయి. వాటిలో చిరు ది బెస్ట్ కథని ఎంచుకునే పనిలో ఉన్నాడు. రేపు ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.