‘ఒక లైలా కోసం’ సెన్సార్ రిపోర్ట్.

okalila-kosam
అక్కినేని యువ హీరో నాగ చైతన్య, పూజా హెడ్గే జంటగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఒక లైలా కోసం’. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్టార్ హీరోల మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల మధ్య విడుదల అవుతున్న రొమాంటిక్ సినిమా ‘ఒక లైలా కోసం’ కావడంతో కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటివల విడుదలైన ఆడియోకి శ్రోతల నుండి మంచి స్పందన లభించింది. ‘మనం’, ‘ఆటో నగర్ సూర్య’ సినిమాల తర్వాత చైతన్య – సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కాంబినేషన్లో వస్తున్న హట్రిక్ మూవీ ఇది.

Exit mobile version