
మాస్ మహారాజ రవితేజ నటించిన ‘పవర్’ సినిమా సెప్టెంబర్ 5న భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. రవితేజ సరసన హన్సిక, రెజీన హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా థియేటర్ ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేసారు. రవితేజ ఈ సినిమాలో మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
నిన్న విడుదలైన పవర్ ట్రైలర్ కి అందరి నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ట్రైలర్ చూస్తుంటే రవితేజ నుంచి అభిమానులు ఏమేమి కోరుకుంటారో అవన్నీ ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయమవుతున్న బాబీ రవితేజని రెండు డిఫరెంట్ లుక్స్ లో చూపించారు. అలాగే హన్సిక, రెజీన గ్లామర్ ఈ సినిమాకి మరింత అట్రాక్షన్ తీసుకొచ్చాయి. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి