యాక్షన్ ఫిల్మ్స్ చేయాలనుకుంటున్న నాగ చైతన్య

naga-chaithanya
అక్కినేని వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అక్కినేని నాగ చైతన్యకి ‘ఏమాయ చేసావే’, ‘100% లవ్’, ‘మనం’ సినిమాలతో రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. మధ్య మధ్యలో నాగ చైతన్య మాస్ పాత్రలు ట్రై చేసినా ఒక్క ‘తడాఖా’ తప్ప మిగతా ఏవీ అనుకున్నంత గుర్తింపు ఇవ్వలేదు. ఇది పక్కన పెట్టి స్వతహాగా మీకెలాంటి సినిమాలు చేయడం ఇష్టం అని అడిగితే చైతన్య మాత్రం యాక్షన్ సినిమాలు చేయడమే ఇష్టం అంటున్నాడు.

‘నాకు పర్సనల్ గా యాక్షన్ సినిమాలు చేయడమే ఇష్టం. కానీ నాకు వచ్చిన హిట్స్ అన్నీ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కావడం వలన రొమాంటిక్ హీరోగా పేరొచ్చింది. కానీ దీనికే పరిమితమైపోకుండా ముందు ముందు రొమాన్స్, యాక్షన్ కలగలిపిన సినిమాలు చేయాలనుకుంటున్నానని’ నాగ చైతన్య అన్నాడు. అలాగే మాట్లాడుతూ ‘మనం నా కెరీర్లో స్పెషల్ మూవీ. నాలోని నటనని మెరుగుపరచుకోవడానికి ఆ సినిమా చాలా హెల్ప్ అయ్యిందని’ అన్నాడు.

నాగ చైతన్య – పూజ హెగ్డే జంటగా నటించిన మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఒక లైలా కోసం’ సెప్టెంబర్ 5న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాని నాగార్జున నిర్మిస్తున్నాడు.

Exit mobile version