నిర్మాతలుగా మారిన టాలీవుడ్ టాప్ పోస్టర్ డిజైనర్స్

anil_bhanu

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనిల్ చంద్రకాంత్ – భాను అవిరినేనిలు సినిమా పబ్లిసిటీ డిజైనింగ్ విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ఎబి కోర్ డిజైన్ లేబుల్ తో ఎన్నో రోజులుగా కలిసి పనిచేస్తున్నారు. ఈ గ్రూప్ వారు ఇప్పటి వరకూ 100 సినిమాలకు పబ్లిసిటీకి సంబందించిన మెటీరియల్ ని డిజైన్ చేసారు.

ఇన్ని రోజులు డిజైనింగ్ రంగంలో రాణించిన వీరిద్దరూ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ‘మేమిద్దరం వేరు వేరు కారణాల వల్ల ఇండస్ట్రీకి వచ్చాము. కానీ మేమిద్దరం కలిసి పోస్టర్ డిజైనింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ‘ఎబిసిడి ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్’ అని ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించనున్నారు. ఈ నిర్మాణ సంస్థని వినాయక చవితి కానుకగా ఆగష్టు 29న న్యూ ఢిల్లీలో లాంచ్ చేయనున్నారని’ అనిల్ – భాను తెలిపారు.

అనిల్ – భానులు మొట్ట మొదటగా 2002లో కృష్ణ వంశీ తీసిన ‘ఖడ్గం’ సినిమాకి పనిచేసారు.ఇప్పటివరకూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డిజైనర్స్ గా పనిచేసి సక్సెఫుల్ అందుకున్న వీరు నిర్మాణ రంగంలో కూడా మంచి విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.

Exit mobile version