
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మరియు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ‘రుద్రమదేవి’ కూడా ఒకటి. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ రోజుటితో రానా రుద్రమదేవిలో తన పార్ట్ కి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేసాడు. మళ్ళీ ఎడిటింగ్ అయిన తర్వాత ఈ చిత్ర టీంతో డబ్బింగ్ చెప్పడానికి కలుస్తానని రానా అన్నాడు.
అలాగే సెప్టెంబర్ నుంచి రానా హిందీ సినిమా బేబీ షూటింగ్ లో పాల్గొననున్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్న ఈ సినిమాకి నీరజ్ పాండే దర్శకుడు. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన రుద్రమదేవి సినిమాని 3డిలో కూడా షూట్ చేస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. అలాగే కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, హంసా నందిని, కేథరిన్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే తోట తరణి వేసిన సెట్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అవుతాయని ఈ చిత్ర టీం భావిస్తోంది.