నాగ చైతన్యకి కథ చెప్పిన పరశురాం.!

naga-chaithanya-parshuram

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన నాగ చైతన్య త్వరలోనే ‘ఒక లైలా కోసం’ రూపంలో మరో సినిమాని రిలీజ్ చేయనున్నాడు. ఇది కాకుండా సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య – కృతి సనన్ జంటగా నటిస్తున్న ఓ సినిమా సెట్స్ పై ఉంది.

అది పూర్తికాక ముందే తన తదుపరి సినిమాల కోసం నాగ చైతన్య కథలు వినే పనిలో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ‘యువత’, ‘సోలో’ లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న పరశురాం నాగ చైతన్యకి ఓ కథ చెప్పాడు. కథ విన్న నాగ చైతన్య ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందని సన్నిహితులు అంటున్నారు. కానీ అధికారికంగా ఖరారు కాలేదు. అన్ని అనుకున్నట్లు జరిగి నాగ చైతన్య పరశురాంకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

ప్రస్తుతం నాగ చైతన్య సుధీర్ వర్మ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న ‘ఒక లైలా కోసం’ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

Exit mobile version