ప్లాప్ సినిమాలు అందుకే తీస్తున్నాను – వర్మ.

ram-gopal-varma

రామ్ గోపాల్ వర్మ… తన సినిమాలతో తెలుగు తెరపై ఒకప్పుడు సంచలనాలు సృష్టించిన దర్శకుడు.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో సదరు దర్శకుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖలు చేశారు అంటూ రెండు రోజుల క్రితం వర్మపై కేసు నమోదు చేశారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర దేవుళ్ళతో పోలిస్తే వినాయకుడు చాలా లావుగా ఉన్నాడు. అతను ఎక్కువ తింటాడా..? అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

విమర్శించడంతో పాటు తన సినిమాలు ఎందుకు ప్లాప్ అవుతున్నాయో తెలుసుకున్నారు వర్మ. దేవుళ్ళ పట్ల నా ప్రవర్తన, ఆటిట్యూడ్ బాగోలేదు. అందువల్లే నా సినిమాలు ప్లాప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. నేను కూడా భక్తుడిగా మారాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.

Exit mobile version