యంగ్ టైగర్ ఎన్టీఆర్, సమంత జంటగా ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రభస’. బెల్లంకొండ సురేష్ సమర్పణలో ఆయన తనయుడు గణేష్ బాబు నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ప్రణిత మరొక హీరోయిన్.
ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 29న ‘రభస’ను విడుదల చేశారు. అయితే యు.ఎస్.ఏ ప్రేక్షకుల కోసం ‘రభస’ ప్రీమియర్ షోలను ఒక్క రోజు ముందుగా వేశారు. ఆగస్ట్ 28 రాత్రి జరిగిన ఈ ప్రిమియర్ షోలకు అద్బుతమైన స్పందన వచ్చింది. సుమారు 58 లక్షల రూపాయలను (96K డాలర్స్) కలెక్ట్ చేసినట్టు ‘రభస’ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. 45 లొకేషన్లలో దాదాపు 100 స్క్రీన్లలో ప్రిమియర్ షోలు ప్రదర్శించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సినిమాకు చక్కని స్పందన లభిస్తుంది.
