తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ కి రికార్డులు కొత్తేంకాదు. ఆయన నడిచినా, నుంచున్నా ఆఖరికి అలా కనిపించినా అది ఒక రికార్డే. ప్రస్తుతం రజిని నటిస్తున్న ‘లింగా’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వినాయక చవితి సందర్భంగా విడుదలచేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఏకంగా 50 వేల మంది చూసినట్టు సమాచారం. దీనిబట్టి రజిని క్రేజ్ ఏంటో అర్ధంచేసుకోవచ్చు
ఈ సినిమాకు కే.ఎస్ రవికుమార్ దర్శకుడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సోనాక్షి సిన్హా, మరియు గ్లామరస్ అనుష్క హీరోయిన్స్. ఏ.ఆర్ రెహమాన్ స్వరకర్త. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు
