
‘బలుపు’ సినిమాతో సక్సెస్ అందుకున్న మాస్ మహారాజ రవితేజ చేసిన మాస్ ఎంటర్టైనర్ ‘పవర్’. ముందుగా ఈ సినిమాని సెప్టెంబర్ 5న రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ సెన్సార్ కార్యక్రమాలు వాయిదా పడడం వల్ల సినిమాని కూడా వాయిదా వేసారు. కాస్త ఆలస్యం యిన్నా పవర్ సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు పూర్తయ్యాయి. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.
రవితేజ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్న ఈ మూవీ ద్వారా బలుపు మూవీ రైటర్ బాబీ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. తమన్ అందించిన ఆడియో ఆల్బమ్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ మూవీ థియేటర్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కూడా సినిమా అనుకున్నదానికంటే బాగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు.
రవితేజ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో హన్సిక, రెజీన హీరోయిన్స్ గా నటించారు. బ్రహ్మానందం, సప్తగిరి, పోసాని కృష్ణమురళి కామెడీ కూడా ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని సమాచారం.