
బ్రహ్మానందం… ఆ పేరు వినిపించినా, తెరపై ఆయన రూపం కనిపించినా మన పెదాలపై ఆటోమేటిక్ గా చిరునవ్వు వచ్చేస్తుంది. బ్రాహ్మి నటనకు తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, తమిళులు కూడా అభిమానులుగా మారుతున్నారు. ఇటీవల జరిగిన మహేష్ బాబు ‘ఆగడు’ ఆడియోలో సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ బ్రహ్మానందం నటనకు, కామెడీకి పెద్ద అభిమాని అని చెప్పిన సంగతి తెలిసిందే.
త్వరలో బ్రహ్మానందం చేత తన సినిమాలో ఫుల్ లెంగ్త్ కేరెక్టర్ చేయించుకోవాలని శంకర్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా బ్రాహ్మికి ఫోన్ చేసి చెప్పారు శంకర్.
‘ఆగడు’ ఆడియోలో వీరిద్దరూ కలుసుకోలేకపోయారు. అందుకే తర్వాత హాస్య బ్రహ్మకు ఫోన్ చేశారు శంకర్. మరో విషయం శంకర్ భార్య, పిల్లలు కూడా బ్రహ్మానందం అభిమానులే. వారికి తెలుగు రాదు, అయినా బ్రహ్మి నటనను ఎంజాయ్ చేస్తున్నారు.