గోవా బ్యూటీ ఇలియానాకి బంపర్ ఆఫర్.?

srk_Ileana

సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ అయిన గోవా బ్యూటీ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ ఒక్కో ఆఫర్ తనవశం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రతి హీరోయిన్ కి బాలీవుడ్ కింగ్ ఖాన్ అయిన షారుఖ్ ఖాన్ తో సినిమా చేయాలని ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం గోవా బ్యూటీ ఇలియానా షారుఖ్ ఖాన్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది.

షారుఖ్ ఖాన్ తదుపరి సినిమా ‘ఫ్యాన్’. ఈ సినిమా కోసం ముందుగా షారుఖ్ కి జోడీగా వాణి కపూర్, పరిణీతి చోప్రా లను పరిశీలించారు కానీ తాజాగా ఈ అవకాశం ఇలియానాకి వెళ్లిందని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ రానుంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాలో బిజీగ ఆన్నాడు. దీపావళి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాత షారుఖ్ ఖాన్ ఫ్యాన్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు.

Exit mobile version