పోలీసులుగా మారిన గబ్బర్ సింగ్ రౌడీలు

gabar-sing-gang
సాధారణంగా ఏ సినిమాలో అయినా మరీ కొత్తగా తీర్చిదిద్దిన పాత్ర అయితే తప్ప విలన్ వెనక ఉండే చోటా విలన్ పాత్రలకి ఆదరణ తక్కువ. కానీ అందుకు విరుద్దంగా గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో అంత్యాక్షరి సన్నివేశాలు చేసిన రౌడీ గ్యాంగ్ పరిశ్రమలో అవకాశాలను బాగా సంపాదించుకున్నారు. సినిమాలో పవన్ తో జరిగే సన్నివేశాలలో వీరు ప్రేక్షకులకి బాగా దగ్గర అయ్యారు. ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో కడుపుబ్బా నవ్వుకున్న సన్నివేశాలలో ఇది ఒకటి.

ప్రస్తుతం ఈ రౌడీ గ్యాంగ్ ని ఆధారంగా చేసుకొని ఒక సినిమా రూపొందుతుంది. ఎం.ఎస్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ‘కొండవీటి పోలీసులు’ అనే పేరుని ఖరారు చేసుకున్నారు. రౌడీలుగా ఉండే ఒక గ్యాంగ్ ని మార్చి మాములు మనుషులుగా మలిచాక కొండవీటి ప్రాంతంలోని స్టేషన్ కి పోలీసులు గా నియమిస్తారు. వాళ్ళు పోలీసులుగా మారిన తదనంతరం ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అనే కథాంశమే ఈ సినిమా. నటి షకీలా ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలోని పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి.

Exit mobile version