
జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న తాజా సినిమా ‘కరెంట్ తీగ’. మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఆమె నటన చూసి ఆమె అభిమాని అయ్యానని హీరో మనోజ్ తెలిపారు. ఈ రోజు మనోజ్, రకుల్ ప్రీత్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హీరో హీరోయిన్ల లుక్ కు మంచి స్పందన లభిస్తుంది.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మోహన్ బాబు సమర్పణలో మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించారు. అచ్చు సంగీత దర్శకుడు. సన్నీ లియోన్ ప్రత్యేక పాత్రలో నటించింది. అక్టోబర్ 2న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంచు మనోజ్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని మంచు విష్ణు అన్నారు.