అక్టోబర్ మొదటి వారంలో ‘ముకుంద’ ఆడియో.

mukunda1
మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ముకుంద’ సినిమా ఆడియోను అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిక్కి జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, మిక్కి జె మేయర్ కాంబినేషన్లో ఇది హట్రిక్ మూవీ.

వరుణ్ తేజ్ సరసన పూజ హెడ్గే నటిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్నారు. ‘ముకుంద’ ఫస్ట్ లుక్ టీజర్ క్లీన్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫీలింగ్ కలిగించింది. తన లుక్స్, స్మైల్, అప్పీల్ తో వరుణ్ తేజ్ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నవంబర్ రెండవ వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version