రవితేజకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్

Ravi-Rakul
మాస్ మహారాజ రవితేజ కెరీర్లో మైలు రాయిగా నిలిచి పోయే సినిమా ‘కిక్’. నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కిక్ కి సీక్వెల్ గా ‘కిక్ 2’ ని నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకి ప్రస్తుతం సెట్స్ పై ఉంది.

ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని పరిశీలిస్తున్నారని తెలియజేశాం. తాజాగా ఈ చిత్ర టీం కిక్ 2 లో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఫైనలైజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నన రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా ఆఫర్ తో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి కథ – మాటలు వక్కంతం వంశీ అందిస్తున్నాడు. కిక్ తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కిక్ 2 పై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. కిక్ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలో కూడా రీమేక్ అయ్యి పెద్ద విజయాన్ని అందుకుంది.

Exit mobile version