
లెజెండ్ యాక్టర్స్ తో ఒకే వేదికను షేర్ చేసుకునే అరుదైన అవకాశాన్ని మిస్ అయ్యాడు దగ్గుబాటి రానా. విక్రమ్, అమీ జాక్సన్ జంటగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారి బడ్జెట్ సినిమా ‘ఐ’. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు(సెప్టెంబర్ 15) సాయంత్రం చెన్నైలో జరుగుతుంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్క్వార్జ్ నెగ్గర్ తో రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య వంటి తమిళ స్టార్ హీరోలు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి రానాకు ఆహ్వానం అందింది. హిందీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో ‘ఐ’ ఆడియోకి రావడం లేదు.
‘సైమా అవార్డ్స్ కార్యక్రమం పూర్తయింది. బేబీ సినిమా షూటింగ్ నిమిత్తం అబు దాబి వెళ్తున్నాను. ఈ రోజు సాయంత్రం జరగనున్న ‘ఐ’ ఆడియో విడుదల వేడుకకు హాజరు కాలేకపోతున్నాను. ఆర్నాల్డ్ ష్క్వార్జ్ నెగ్గర్, రజినీకాంత్ వంటి లెజెండ్ యాక్టర్స్ ను ఒకే వేదిక మీద చూసే అవకాశం మిస్ అవుతున్నాను. విక్రమ్, శంకర్, నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ లకు నా అభినందనలు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రానా.