
నిఖిల్ సిద్దార్థ్ హీరోగా అక్టోబర్ 24న రిలీజ్ అయిన ‘కార్తికేయ’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మాత్రం కలెక్షన్స్ బాగా కురిపిస్తోంది. ఈ చిత్ర విజయంతో ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన సిరువూరి రాజేష్ వర్మ అప్పుడే తన తదుపరి సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కి ‘భం భోలేనాథ్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.
‘కార్తికేయ’ సినిమాకి రేటింగ్ మరియు స్క్రీన్ ప్లే డిపార్ట్ మెంట్ లో పనిచేసిన దండు కార్తీక్ వర్మ ‘భం భోలేనాథ్’ తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో నవదీప్ మరియు అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర హీరోలుగా నటించారు. షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈ చిత్ర టీం ఈ నెలాఖరున ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. త్వరలోనే ఈ చిత్ర టీం అధికారిక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.