పివిపి సంస్థలో అనుష్క – ప్రకాష్ కోవెలమూడి సినిమా.

anushka-pvp-prakash-kovelam

నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ ‘బొమ్మలాట’, ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాల తర్వాత మరోసారి మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అయ్యారు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి. అనుష్క ప్రధాన పాత్రలో నటించబోయే ఈ సినిమాను పివివి సినిమా సంస్థ నిర్మిస్తుంది. యం.యం.కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభమవుతుంది. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. త్వరలో ఈ సినిమా వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

కథా బలమున్న సినిమాలకు బెంగుళూరు బ్యూటీ అనుష్క కేరాఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం అనుష్క ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘లింగ’ సినిమాలలో నటిస్తుంది.

Exit mobile version