మాస్ మహారాజ రవితేజ కెరీర్లో మైలు రాయిగా నిలిచి పోయే సినిమా ‘కిక్’. నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ‘కిక్’ కి సీక్వెల్ గా ‘కిక్ 2’ ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఇప్పటికే క్రేజ్ ఉన్న ఈ కిక్ 2 సినిమా టీంలో మరో క్రేజీ స్టార్ కమెడియన్ ఎంటర్ అయ్యాడు. అది కూడా బాలీవుడ్ నటుడు.
అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ ఫేమస్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ కిక్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ షూటింగ్ లో పాల్గొనడానికి రాజ్‌పాల్ యాడి నిన్ననే హైదరాబాద్ వచ్చాడు. ‘ఇప్పుడే టాలీవుడ్ లో ల్యాండ్ అయ్యాను, నా తెలుగు సినిమా కిక్ 2 కోసం షూటింగ్ మొదలుపెడుతున్నానని’ రాజ్‌పాల్ యాదవ్ ట్వీట్ చేసాడు.
టాలీవుడ్ లో వరుస హిట్స్ తో లక్కీ గర్ల్ గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ కిక్ 2 లో రవితేజ సరసన జోడీ కడుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి కథ – మాటలు వక్కంతం వంశీ అందిస్తున్నాడు. కిక్ తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కిక్ 2 పై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.
