‘లింగ’ రీ షూట్ చెయ్యడం లేదు – రాక్ లైన్ వెంకటేష్

Lingaa-Poster11
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా ‘లింగ’. ఈ సినిమా షూటింగ్ మూత్తం పూర్తయ్యింది. ప్రసతుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాలోని కొంత భాగాన్ని రీ షూట్ చేస్తున్నారని తమిళ తెలుగు ఇండస్ట్రీల్లో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను ఈ చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కొట్టిపారేశారు.

‘సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఇప్పుడు రీ షూట్ ఏమీ చెయ్యడం లేదు. అలాగే మేము సినిమాని ముందు చెప్పినట్టుగానే రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న కచ్చితంగా రిలీజ్ చేస్తామని’ రాక్ లైన్ వెంకటేష్ తెలిపాడు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమా ఆడియోని నవంబర్ 16న బాగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు.

Exit mobile version