
సూర్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మాస్’. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాల తీసే వెంకట్ ప్రభు సూర్య కోసం మంచి థ్రిల్లర్ కథను రెడీ చేశారని యూనిట్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. టేకింగ్ పరంగా కొత్తదనం చూపేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నారు. కెమెరా ఫిట్ చేసిన భారి క్రేన్ లను షూటింగ్ లో ఉపయోగిస్తున్నారు. సినిమాను స్టైలిష్ గా తీర్చిదిద్దడానికి ట్రై చేస్తున్నారు.
ఈ సినిమాలో సూర్య సరసన నయనతార, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తయిన తర్వాత మూవీ యూనిట్ బల్గేరియా వెళ్తుందని సమాచారం. అక్కడ తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరుగురుతుంది. తమ్ముడు కార్తికి ‘బిరియాని’ వంటి విజయవంతమైన సినిమా అందించిన వెంకట్ ప్రభు, సూర్య ‘మాస్’ను హిట్ చేయాలని కృత నిశ్చయంతో ఉన్నాడు.