
2014 మొదట్లో ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన ముంబై భామ ఆద శర్మ. ఆ సినిమా విజయంతో హార్ట్ ఎటాక్ భామగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకి తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఆద శర్మ త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం మాత్రమే కాకుండా ఫిల్మ్ నగర్లో కూడా తన టాలెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు.
అలాగే ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ లో కూడా కూడా ఆద శర్మ చేసిన రాకింగ్ పెర్ఫార్మన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ధనుష్ తో చేసిన సెంటర్ ఫ్రెష్ యాడ్ తో కూడా చాలా మందికి రీచ్ అయ్యింది. భారీ చిత్రాల నిర్మాత పివిపి త్రివిక్రమ్ సినిమా రషెస్ చూసి ఆద శర్మతో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చెయ్యడానికి నిర్ణయం తీసుకున్నాడు.
‘ముందుగా ఆ సినిమా కోసం ఓ పాపులర్ హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆద శర్మ టాలెంట్ చూసిన తర్వాత ఫ్రెష్ లుక్ ఉన్న ఆద శర్మతో చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఆద చేసిన హిందీ మూవీ 1920 చూసి కూడా పివిపి బాగా ఇంప్రెస్ అయ్యాడని’ పివిపి సన్నిహితులు చెబుతున్నారు.