రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై కమల్ హాసన్ వ్యాఖ్యలు.

kamal-haasan-rajinikanth
ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేయాలని అభిమానులు ఎప్పటి నుండో కోరుతున్నారు. ఇటీవల కాలంలో ఈ వాదన బలంగా వినిపిస్తుంది. రజని రాజకీయాలలో అడుగు పెడతారా..? లేదా..? అనే ప్రశ్న మీడియా నుండి రజినీకాంత్ సన్నిహితులకు ఎదురవుతుంది. తాజాగా కమల్ హాసన్ తనదైన శైలిలో ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఇటీవల తరచూ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి మీడియాలో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ప్రజలు కూడా ఈ అంశం గురించి చర్చించుకుంటున్నారు. రజని రాజకీయాలలో అడుగు పెడతారా..? లేదా..? అనే ప్రశ్న మీరు ఆయనను అడిగితేనే బాగుంటుంది. సమాధానం ఇవ్వగల ఏకైక వ్యక్తి రజిని మాత్రమే. అంటూ తన 60వ పుట్టినరోజున కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.

కమల్, రజనీకాంత్ ఇద్దరూ దర్శకుడు బాలచందర్ శిష్యులు, మంచి స్నేహితులు అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకేసారి సినిమాలలో ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్లుగా ఎదిగారు.

Exit mobile version