‘రౌడీ ఫెలో’, ‘నా బంగారు తల్లి’ సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్

rowdy-fellow-and-Naa-Bangar
ఈ శుక్రవారం మొత్తం ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో రెండు సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నాయి. మూడు జాతీయ అవార్డులతో పాటు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో విమర్శల ప్రసంశలు అందుకున్న సినిమా ‘నా బంగారు తల్లి’. ఈ సినిమా ప్రీమియర్ చూసిన ప్రముఖులు చిరు, అమల, సమంత తదితరులు సినిమా బాగుందంటూ.. అందరిని చూడమని ప్రచారం చేస్తున్నారు. ఇక రెండవ సినిమా ‘రౌడీ ఫెలో’.

ప్రయోగాత్మక కథలతో చక్కని సినిమాలను అందించిన నారా రోహిత్.. ప్రేక్షకులలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఈ యువ హీరో నటించిన ‘రౌడీ ఫెలో’ సినిమా ట్రైలర్లు ప్రేక్షకులను అమితంగా ఆకర్షించాయి. ఆడియో శ్రోతలను ఆకట్టుకోవడం, నారా రోహిత్ ఇమేజ్ ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ తీసుకొచ్చాయి. ఎక్కువ శాతం ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సినిమా చూసిన ఇండస్ట్రీ వర్గాలు రోహిత్ మరో హిట్ కొట్టాడు అంటున్నారు.

ఈ శుక్రవారం ప్రేక్షకులు వీటికి ఎటువంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి. ఈ సినిమాలు కాకుండా వర్మ ‘ఐస్ క్రీమ్ 2’, ఆర్ నారాయణ మూర్తి ‘రాజ్యాధికారం’, నూతన దర్శకుడు తెరకెక్కించిన ’33 ప్రేమకథలు’ కూడా విడుదలవుతున్న సినిమాల జాబితాలో ఉన్నాయి.

Exit mobile version