
ఈ శుక్రవారం నారారోహిత్ నటించిన ‘రౌడీ ఫెల్లో’ సినిమా విడుదలకానుంది. ఈ చిత్రానికి లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా అటు రోహిత్ కు ఇటు చైతన్యకు ముఖ్య చిత్రం కానుంది. ఇద్దరూ సినిమాకోసం చాలా కష్టపడ్డారు. రోహిత్ పర్సనల్ స్టైల్ దగ్గరనుండి సినిమా అంతా స్టైలిష్ గా తీయడానికి దర్శకుడు పడ్డ తపన ట్రైలర్ లలో కనిపిస్తుంది. ప్రముఖ తత్వవేత్తలు వెల్లడించిన సారాంశం ఈ సినిమాలో కనిపిస్తుంది.
విశాఖ సింగ్ హీర్యిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి కామెడీ పాత్ర పోషించనున్నాడు.