పవన్ తో విడాకుల గురించి రేణు దేశాయ్ ఎం చెప్పబోతుంది..?

pawan-kalyan-renu-desai
ఈ ఏడాది తన పుట్టినరోజు (డిసెంబర్ 4)న వ్యక్తిగత విషయాలపై స్పెషల్ ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి, దర్శకనిర్మాత రేణు దేశాయ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. డిసెంబర్ 4న ఈ ఇంటర్వ్యూ వీడియో యుట్యూబ్ లో విడుదల కానుంది.

‘తొలిసారిగా నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లడబోతున్నాను. వేరి స్పెషల్ & పర్సనల్ ఇంటర్వ్యూ’ అని రేణు దేశాయ్ పేర్కొనడంతో పవన్ అభిమానులలో ఈ ఇంటర్వ్యూపై ఆసక్తి పెరిగింది. పవన్ తో విడాకులు తీసుకున్న అనంతరం రేణు పూణే వెళ్ళిపోయారు. తర్వాత పవన్, రేణు దేశాయ్ ఈ విషయం గురించి పెదవి విప్పలేదు. ఎందరు ప్రశ్నించినా మౌనమే సమాధానం అయ్యింది. మరి పుట్టినరోజు నాడు ఇస్తున్న ఇంటర్వ్యూలో ఎం చెప్తుందో..? అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రేణు దేశాయ్ ఎం చెప్పినా సంచలనమే అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో ముడిపడి ఉన్న వ్యవహారం కనుక. పవన్ విడాకులకు సంబందించిన అంశం కనుక.

Exit mobile version