‘లయన్’ గా రానున్న బాలకృష్ణ

balakrishna
‘లెజెండ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి బాలకృష్ణ చేస్తున్న తదుపరి సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ‘లెజెండ్’లో లానే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చాలా రోజులుగా అభిమానులు ఈ సినిమాకి ఏమి టైటిల్ పెడతారా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర టీం ఈ సస్పెన్స్ కి తెరదించిన ఈ సినిమాకి ‘లయన్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి ముహూర్తం కూడా అఫిక్స్ చేసారు.

2015 న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11:48 నిమిషాలకు లయన్ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. ‘లెజెండ్’ లానే ఈ సినిమా కూడా తన ఆడియన్స్ ని మెప్పించేలా ఉంటుందని ఈ చిత్ర టీం ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది.

Exit mobile version