
రిపబ్లిక్ డే, జనవరి 26న మాస్ మహారాజ్ రవితేజ పుట్టినరోజు కానుకగా ‘కిక్ 2’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. ‘రేసుగుర్రం’ సినిమాతో మంచి జోరుమీదున్న దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటివలే అభిమానుల సమక్షంలో గ్రాండ్ ఓపెనింగ్ జరుపుకుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. రవితేజ, సురేందర్ రెడ్డి ఇద్దరి కెరీర్ లో ‘కిక్’ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని కోరుకుందాం.