మళ్ళీ సింగర్ గా మారిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి

Sirivennela1
ఒక పాటని అందమైన ప్రశ్నలు లేదా ముక్కుసూటిగా అడిగే ప్రశ్నల రూపంలో కూడా రాయచ్చు అని నిరూపించినది గ్రేట్ లిరిసిస్ట్ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. గతంలో ఆయన పాటల రచయితగానే కాకుండా అప్పుడప్పుడు పాటలు కూడా పాడారు. కానీ చాలా కాలంగా సింగర్ గా ఎక్కడా పాటలు పాడని ఆయన మళ్ళీ సింగర్ గా మారి ఓ పాట పాడారు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘దాగుడు మూతల దండాకోర్’ సినిమాలో ఓ పాటని పాడారు. డైరెక్టర్ క్రిష్ – రామోజీ రావు కలిసి నిర్మించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈఎస్ మూర్తి సంగీతం అందించాడు.

‘దాగుడు మూతల దండాకోర్’ తమిళ హిట్ ఫిల్మ్ ‘శైవం’కి అఫీషియల్ రీమేక్. రాజేంద్ర ప్రసాద్ బేబీ సర అర్జున్ లతో పాటు నాని అనే పేరు గల ఓ కోడి పుంజు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ‘కొక్కో కొక్కో’ అనే పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రి పాడారు. ఈ పాటని నాని అనే కోడిపుంజుపై షూట్ చేసారు. ఆర్ కె మలినేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version