చిట్ చాట్ : నందమూరి కళ్యాణ్ రామ్ – నా కొత్త అవతార్ అందరికీ బాగా నచ్చింది.!

Kalyan-Ram
నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన పవర్ఫుల్ పోలీస్ ఎంటర్టైనర్ ‘పటాస్’. ఈ సినిమా జనవరి 23న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కళ్యాన్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పటికే 10 కోట్ల షేర్ ని క్రాస్ చేసింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకోవడం కోసం మీడియా మిత్రులతో కాసేపు ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్రశ్న) పటాస్ సినిమా సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు.?

స) కచ్చితంగా పటాస్ సక్సెస్ వల్ల చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఓ మంచి సక్సెస్ వచ్చింది. దీని కోసం చాలా రోజులుగా వెయిట్ చేసాను. సక్సెస్ వచ్చినందుకు హ్యాపీగా ఉన్నాను. కానీ దానివల్ల మరింత బాధ్యత పెరిగింది. ముందు ముందు మంచి సినిమాలు అందించడానికే ప్రయత్నిస్తాను.

ప్రశ్న) పటాస్ సినిమా సక్సెస్ ని మీరు ఎవరికి డెడికేట్ చేస్తారు.?

స) కచ్చితంగా ఈ సినిమా విజయాన్ని ప్రేక్షకులకే డెడికేట్ చేస్తాను. వాళ్ళు లేకపోతే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదు. ఈ సినిమాకి ఇండస్ట్రీ నుంచి, స్టార్స్ నుంచి, మీడియా మరియు ప్రేక్షకుల నుంచి మొదటి రోజు నుంచీ ఎంతో పాజిటివ్ టాక్ తో సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఈ విజయం ప్రేక్షకులదే.. ఇటీవలే విజయయాత్రలో కూడా చెప్పాను. ఇది విజయ యాత్ర కాదు, మా సినిమా సక్సెస్ చేసినందుకు మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవాలని వచ్చామని తెలిపాను.

ప్రశ్న) ‘ఓం’ తర్వాత మీరు ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ సినిమా ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి.?

స) ‘ఓం’ సినిమా టైంలో అనిల్ నాకు ఈ కథని నాకు చెప్పాడు. రెండు గంటలు నేను అన్నీ మరచిపోయి బాగా ఎంజాయ్ చేసాను. కచ్చితంగా సూపర్ హిట్ అయ్యే స్క్రిప్ట్, నువ్వు పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడని చెప్పాను. కానీ అప్పుడు నా మైండ్ సెట్ వేరేలా ఉంది అందుకే నేను కాకుండా వేరే హీరోతో చేద్దాం అన్నాను. ఆ తర్వాత నేను బిజీ, తను బిజీ.. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత వచ్చి ఆ కథ చేద్దామా అని అడిగాడు. మళ్ళీ కథ విన్నాను, అన్నీ ఉన్నాయి కదా చేద్దాం అనీ చేసాను.

ప్రశ్న) పటాస్ విజయం మీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ తెచ్చింది.?

స) కుటుంబ సభ్యుల నుంచి, ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరి నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ కళ్యాణ్ రామ్ కొత్త అవతార్ ని బాగా ఇష్టపడుతున్నారు. ఇక నుంచి ఇలా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే సినిమాలు చేయాలనుకుంటున్నాను.

ప్రశ్న) అంటే ఇక నుంచి మీరు కథలు ఎంచుకునే విధానం మారుతుందా.? ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండే కథలను ఎంచుకుంటారా .?

స) అలా ఏమీ ఉండదండి.. పటాస్ ముందు నుంచే నేనొక విషయాన్ని తెలుసుకున్నాను. అదేమిటంటే మన సినిమా ప్రేక్షకులకు బర్డన్ కాకూడదు. మనం ప్రతి రోజూ ఎన్నో పనులతో బిజీగా ఉంటాం. అలాంటి టైంలో మూడ్ మార్చుకొని ఎంజాయ్ చెయ్యడానికి సినిమా వస్తారు. వాళ్ళకి కాస్త టిపికల్ గా కాకుండా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు ఎంటర్టైనింగ్ గా సినిమా చెప్పం అనుకోండి చాలు. అందుకనే ఇక నుంచి అలాంటి కథలకే పెద్ద పీట వేద్దాం అనుకుంటున్నాను.

ప్రశ్న) హిందీ, తమిళ ఇండస్ట్రీల్లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తున్నాయి. మీరు అలాంటి సినిమాలు చేసే ఆలోచన ఏమన్నా ఉందా.?

స) అవును అక్కడ అలాంటి సినిమాలు వచ్చి మంచి విజయాలు కూడా అవుతున్నాయి. నేను మొదటి నుంచి డిఫరెంట్ సినిమాలే చేస్తున్నాను. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలు వస్తే కచ్చితంగా చెయ్యడానికి నేను రెడీ..

ప్రశ్న) మీరు హీరోగా మరియు మీ బ్యానర్ లో చేయనున్న సినిమాల గురించి చెప్పండి.?

స) నా తదుపరి సినిమా ‘షేర్’. ఇది కాకుండా మరికొన్ని కథలు వింటున్నాను. ఇక ప్రొడక్షన్ లో కిక్ 2 తర్వాత తమ్ముడు ఎన్.టి.ఆర్ తో ఓ సినిమా ఉంటుంది. మంచి కథ దొరికితే బాబాయ్(బాలకృష్ణ)తో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాను. కానీ అది ఇంకా గ్రౌండ్ లెవల్లోనే ఉంది.

ప్రశ్న) బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ మొదటి సినిమా మీ బ్యానర్లోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దానిపై మీ కామెంట్.?

స) ఫుల్ నవ్వులు… అవన్నీ రూమర్స్ అండీ. నాకు తెలిసి మోక్షజ్ఞ లాంచ్ కి ఇంకా టైం ఉంది. నాకు మోక్షజ్ఞని లాంచ్ చేసే అవకాశం వస్తే అది నాకు, నా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ కి దక్కిన గౌరవంగా భావిస్తాను.

Exit mobile version