త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్లో ‘పార్ధు’..?

maheshbabu-trivikram
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన ‘అతడు’ క్లాసికాల్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని వీరిద్దరూ భావిస్తున్నారట. ఈ ఏడాది మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకేక్కబోయే సినిమాకు ‘పార్ధు’ అనే టైటిల్ నిర్ణయించినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. హారికా & హాసిని బ్యానర్ ఫిల్మ్ ఛాంబర్ లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించిందట.

‘అతడు’ సినిమాలో మహేష్ బాబు పేరు ‘పార్ధు’నే. ఇప్పుడు ఇది టైటిల్ సినిమాకు పెట్టడంతో, ‘అతడు’ సీక్వెల్ అయ్యుండొచ్చని ఫిల్మ్ నగర్ లో ఓ వార్త షికారు చేస్తుంది. ఆ సినిమాలో మహేష్ బాబు క్యారేక్టరైజేషన్, ఈ సినిమాలో కూడా కొనసాగించే అవకాశం ఉండొచ్చు. ‘అతడు’లో ప్రేమకథతో పాటు, హీరో కథ కూడా సుఖాంతం అయ్యింది. అందువల్ల, ‘అతడు’ సీక్వెల్ తీసే అవకాశం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దర్శకహీరోలు అధికారికంగా వెల్లడిస్తే.. అభిమానులకు ఓ క్లారిటీ వస్తుంది.

Exit mobile version