
‘పటాస్’తో హీరోగా, నిర్మాతగా ఘన విజయం అందుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించిన ఈ హీరో, ఇప్పటివరకు తను హీరోగా మాత్రమే సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. నిర్మాణ సంస్థను విస్తరించాలనే ఉద్దేశంతో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘కిక్ 2’ను నిర్మిస్తున్నారు. మంచి కథలు దొరికితే ఇతర స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్కినేని యువ హీరో నాగ చైతన్యతో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గతంలో నాగ చైతన్యకు ఓ స్క్రిప్ట్ గురించి చెప్పాను. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. అని ‘పటాస్’ ఘన విజయం సాదించిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ చెప్పారు. అంటే, త్వరలోనే ప్రేక్షకులకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో అక్కినేని హీరో సినిమాను చూసే అవకాశం కలుగుతుంది.