‘ముకుంద’ తర్వాత నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కించడానికి నిర్మాత సి.కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని 123తెలుగు.కామ్ గతంలో తెలియజేసింది. ఈ సినిమా వివరాలను నేడు అధికారికంగా ప్రకటించారు. పూరి దర్శకత్వంలో వరుణ్ రెండవ సినిమా కన్ఫర్మ్ అయ్యింది. సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ సమర్పణలో శ్రీ శుభ శ్వేతా ఫిల్మ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ సినిమా రూపొందనుంది.
ప్రస్తుతం ‘టెంపర్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో పూరి జగన్నాధ్ బిజీగా ఉన్నారు. ‘టెంపర్’ విడుదల తర్వాత వరుణ్ తేజ్ సినిమా స్క్రిప్ట్, ఇతర విషయాలపై పూర్తి స్థాయిలో కాన్సంట్రేట్ చేస్తారు. వరుణ్ సినిమా పూర్తయిన తర్వాత ఛార్మి ప్రధాన పాత్రలో ‘జ్యోతిలక్ష్మి’ సినిమాను రూపొందిస్తారు.
