టెంపర్ వన్ మ్యాన్ షో కాదు : పూరి జగన్

puri-temper
ఆంధ్రావాలా డిజాస్టర్ తరువాత తారక్ – పూరిల కాంబినేషన్ లో వస్తున్న సినిమా టెంపర్. ఇటీవలే ఆడియో విడుదలైన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకు సిద్ధపడుతుంది. ట్రైలర్ లతో, సాంగ్ టీజర్ లతో రోజురోజుకూ అంచనాలు పెంచేస్తున్న ఈ చిత్రంపై పూరి జగన్నాద్ సంచలన కామెంట్స్ చేశాడు. అందరూ చెప్పేలా మా సినిమా మొత్తం హీరో చుట్టూ తిరుగుతుందని చెప్పకుండా టెంపర్ వన్ మ్యాన్ షో కాదని స్టేట్మెంట్ ఇచ్చాడు.

ఈ సినిమాలో తారక్ నటన ఎంత పవర్ ఫుల్ గా వుంటుందో, వక్కంతం వంశీ కధ, తన సంభాషణలు, అనూప్ రూబెన్స్ సంగీతం, కాజల్ అందాలు అన్నీ అంతే పవర్ ఫల్ గా సరైన మోతాదులో కలిసి ఈ సినిమాని అలరించడానికి సిద్ధపడ్డాయని తెలిపాడు. మరి ఇంతమంది కష్టాన్ని తెరపైకి చూడడానికి మీరు సిద్ధమేనా?

Exit mobile version