మహేష్ బాబు – కొరటాల సినిమాకి మరో టైటిల్.?

Mahesh-Babu-Koratala-Shiva
సూపర్ స్టార్ మహేష్ బాబు – కూరతల శివ కాంబినేషన్ లో రానున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా మొదలైన రోజు నుంచి ఈ సినిమా కోసం పలు టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు టైటిల్స్ వచ్చాయి కానీ వాటిల్లో నిజం లేదని కొందరు కొట్టిపారేశారు. గత కొద్ది రోజులుగా వినపడుతున్న టైటిల్ ‘శ్రీ మంతుడు’. మేము కూడా ఇదే టైటిల్ ఎక్కువ భాగం ఓకే అయ్యే అవకాశముందని
తెలిపాము. కానీ తాజాగా ఈ చిత్ర టీం నుంచి మరోకొత్త టైటిల్ వినపడుతోంది.

తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి ‘జమిందార్’ అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు తెరపై ఉన్న ఈ రెండు టైటిల్స్ ద్వారా ఈ సినిమాకి సంబందించిన స్టొరీ లైన్ ఏంటనేది తెలియడం లేదు. కానీ మహేష్ బాబు మాత్రం ఈ సినిమాలో రిచ్ కిడ్ లా కనిపించనున్నాడనేది మాత్రం అర్థమవుతోంది. త్వరలోనే ఈ చిత్ర టీం తదుపరి షెడ్యూల్ కోసం పొల్లాచ్చి వెళ్లనున్నారు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

Exit mobile version