రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమాకు అనిరుధ్ మ్యూజిక్.

ram-charan-anirudh
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోయే తాజా సినిమాకు ‘కొలవేరి డి’ ఫేం అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూనివర్సల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నారు. సమంత హీరోయిన్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెల నుండి ప్రారంభమవుతుంది.

విబేధాల కారణంగా విడిపోయిన దర్శకుడు శ్రీను వైట్ల, రచయిత ద్వయం కోన వెంకట్, గోపి మోహన్ లు మళ్లీ ఈ సినిమాతో ఒక్కటవుతున్నారు. రామ్ చరణ్ కోసం ఈ రచయితలు కొత్త తరహా కథను రెడీ చేశారు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కావడంతో షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాను ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Exit mobile version