
కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఫిల్మ్ ప్రమోషన్లకు, పబ్లిసిటీకి కొత్త అడ్డాగా మారింది. ‘ముకుంద’ విడుదల సమయంలో వరుణ్ తేజ్, పూజా హెడ్గే.. ‘బీరువా’ కోసం సందీప్ కిషన్.. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సినిమా వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా చూసుకున్నారు. తాజాగా తమిళ హీరో ధనుష్, నాగార్జున షోలో పాల్గొన్నాడు. త్వరలో విడుదల కానున్న ‘అనేకుడు’ సినిమా విశేషాలను నాగార్జునతో కలిసి ఈ కార్యక్రమంలో పంచుకున్నారు.
‘రంగం’ ఫేం కెవి ఆనంద్ దర్శకత్వంలో ధనుష్, అమైరా దస్తూర్ జంటగా నటించిన సినిమా ‘అనేకుడు’. హారిస్ జయరాజ్ స్వరపరిచిన ఈ సినిమా తెలుగు ఆడియో నేడు, ఫిబ్రవరి 10న హైదరాబాద్లో సినీ ప్రముఖుల నడుమ అత్యంత వైభవంగా విడుదల కానుంది. ఈ ఏడాది ‘రఘువరన్ బిటెక్’, ‘పందెం కోళ్ళు’ సినిమాల తర్వాత తెలుగులో ధనుష్ మార్కెట్ పెరిగింది. ‘అనేకుడు’తో హట్రిక్ కొట్టాలని ఆశిస్తున్నాడు.