
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండు కథల్లో ముందుగా శ్రీను వైట్ల సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ఒక శుభవార్త. మాకు అందిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ – శ్రీను వైట సినిమాని మార్చి 5న అధికారికంగా లాంచ్ చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.
రామ్ చరణ్ శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేయనున్న తదుపరి సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కథని అందిస్తున్నారు. ఈ సినిమాలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గత సినిమాల మార్క్ ఎక్కడా కనిపించకుండా ఉండేలా కేర్ తీసుకున్నామని రచయితలూ కోన వెంకట్ – గోపి మోహన్ లు తెలిపారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత లేదా రకుల్ ప్రీత్ సింగ్ లలో ఒకరిని హీరోయిన్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ సినిమా కాకుండా రామ్ చరణ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అలాగే చిరంజీవి 150వ సినిమాని కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.