
ఇప్పుడు ఎక్కడ చూసినా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా ‘టెంపర్’ గురించే చర్చ జరుగుతుంది. ఈ సినిమాపై అభిమానులలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎన్టీఆర్ గత సినిమాల ఫెయిల్యూర్స్ ‘టెంపర్’పై ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీనికి కారణం ట్రైలర్ లో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్, పూరి జగన్నాధ్ టేకింగ్, కాజల్ గ్లామరస్ షో అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆడియోలో ఎన్టీఆర్ హార్ట్ టచింగ్ స్పీచ్ కూడా ఓ కారణం అని చెప్పాలి. సినిమాపై ఇండస్ట్రీ ప్రముఖులలో పాజిటివ్ బజ్ నెలకొనడం, రోజుకొక ఇంట్రెస్టింగ్ ఫీలర్ బయటకు రావడంతో అభిమానులలో గంట గంటకు ‘టెంపర్’ ఫీవర్ పెరుగుతుంది.
సినిమా భారి విజయం సాదిస్తుందని నందమూరి తమ్ముళ్ళు ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో భారి ఎత్తున విడుదలకు ‘టెంపర్’ రెడీ అయ్యింది. ముందుగా ప్రకటించిన సమయానికి బెనిఫిట్ షోలు, రెగ్యులర్ షోలు వేయడం జరుగుతుంది. నిర్మాత బండ్ల గణేష్ ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా భారిగా సినిమాను నిర్మించారు. తెరపై ఆ నిండుదనం కనపడుతుందని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఫలితం ఏంటనేది అందరికి తెలిసిపోతుంది.