కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్.టి.ఆర్ చేసే సినిమా అదేనా.?

ntr-kalyan-ram
నందమూరి యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత ‘పటాస్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాని కళ్యాణ్ రామ్ తన ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ సినిమానే కాకుండా తన బ్యానర్ పై వరుసగా సినిమాలు చేయడానికి కళ్యాణ్ రామ్ ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే రవితేజతో చేస్తున్న ‘కిక్ 2’ సినిమా చివరి దశకు చేరుకుంటోంది. ఈ సినిమాని మేలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు.

ఇది కాకుండా ఈ సంవత్సరం తన బ్రదర్ ఎన్.టి.ఆర్ తో ఓ సినిమా చేస్తానని చెప్పాడు. ఇటీవలే ఎన్.టి.ఆర్ ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ కి డైరెక్షన్ చాన్స్ ఇస్తూ తను చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ – వక్కంతం వంశీ సినిమాని కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడని సమాచారం. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ సుకుమార్ సినిమా షూటింగ్ మొదలైంది. దీని తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

ఇది కాకుండా కళ్యాణ్ రామ్ తను హీరోగా చేస్తున్న ‘షేర్’ సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. అలాగే జిల్లా సినిమా రీమేక్ ని కూడా పరిశీలిస్తున్నాడు.

Exit mobile version