సోనాల్ చౌహాన్ తో రొమాన్స్ చేస్తున్న రామ్

Sonal-Chauhan-and-ram
ఎనర్జిటిక్ హీరో రామ్ – టాలీవుడ్ గోల్డెన్ లెగ్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా ‘పండగ చేస్కో’. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు సోనాల్ చౌహాన్ కూడా మరో హీరోయిన్ గా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా పోచుగల్ లో రకుల్ ప్రీత్ తో రొమాన్స్ చేసిన రామ్ ప్రస్తుతం సోనాల్ చౌహాన్ తో రొమాన్స్ చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ తన పార్ట్ కి సంబందించిన సాంగ్ షూట్ ని ఫినిష్ చేసుకొని ఇండియాకి తిరిగి రాగా, మిగతా టీం అంతా పోర్చుగల్ లో షూటింగ్ చేస్తున్నారు.

ప్రస్తుతం రామ్ – సోనాల్ చౌహాన్ లపై రొమాంటిక్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. అలాగే త్వరలో వీరిద్దరిపై ఓ పాటని కూడా షూట్ చేయనున్నారు. మార్చి 23 వరకు జరగనున్న ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అమెరికా నుండి ఇండియా వచ్చిన స్టైలిష్ ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ కనిపించనున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలో సాంగ్ షూటింగ్ ని ఫినిష్ చేసి ఏప్రిల్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ‘పండగ చేస్కో’ను నిర్మిస్తున్నారు.

Exit mobile version